Sunday, 19 January 2020

అజిత్ అభిమాని తల్లిపై నటి దారుణ వ్యాఖ్యలు

పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అనేవారు లేరు కదా అని హీరోలపై హీరోయిన్లపై నోటికొచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇలాంటి కామెంట్స్ హీరోయిన్సే ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా ‘అన్నమయ్య’ నటి కస్తూరికి ఓ నెటిజన్ నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తమిళ సూపర్‌స్టార్ అజిత్ అభిమాని అయిన సదరు నెటిజన్.. కస్తూరిని టార్గెట్ చేస్తూ నోటికొచ్చిన కామెంట్స్ చేశాడు. అతను ఈ కామెంట్స్ చేసింది జనవరి 12న. కానీ నిన్ననే తనపై చేసిన తప్పుడు కామెంట్స్‌ను చూశారు. దాంతో ఆమె కోపోద్రిక్తురాలయ్యారు. అజిత్ లాంటి సూపర్‌స్టార్ అభిమానిని అని చెప్పుకుంటూ తన క్యారెక్టర్‌పై నీచమైన కామెంట్స్ చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పాలనుకున్నారు. వెంటనే ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ..‘మనిషో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ ఇలా అజిత్ అభిమాని అని చెప్పుకుంటూ ఆడవాళ్లపై నీచమైన కామెంట్స్ చేసే వెధవలని ఏం చేయాలి? మీకు అమ్మాయిని చూడగానే సెక్స్ మాత్రమే గుర్తుకు వస్తే బయటికి వెళ్లే బదులు మీ అమ్మ దగ్గరికో లేక సోదరి దగ్గరికో వెళ్లండి’ అని ఘాటుగా స్పందించారు. అంతే కాదు ఇలాంటి ఆడవాళ్లపై సెక్సిస్ట్ కామెంట్స్ చేసేవారిపై ట్విటర్ చర్యలు తీసుకోవాలని కోరారు. READ ALSO: అంతేకాదు ‘dirtyajithfans’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దాంతో అజిత్ ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. కస్తూరిపై పగ తీర్చుకునేందుకు ‘dirtykasturiaunty’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. ‘అజిత్ అభిమానులకు ఉన్న ఏకైక ఉద్యోగం ఆడవాళ్లపై దరిద్రమైన కామెంట్స్ చేస్తూ పాపులర్ అవడం. తప్పు చేస్తున్న వారిని అదుపుచేయాల్సిందిపోయి వారితో చేతులు కలిపిన మీరు ఎంతకు దిగజారిపోయారో అర్థమవుతోంది’ అని మండిపడ్డారు. ఏదేమైనా కస్తూరి అమ్మ, సోదరి అంటూ దరిద్రమైన వ్యాఖ్యలు చేసుండాల్సింది కాదు అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37cRwNp

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....