సెన్సేషనల్ తమిళ బుల్లితెర నటి ఆత్మహత్యాయత్నం చేశారు. చాలా కాలంగా తన భర్తతో ప్రవర్తతో విసిగిపోయిన జయశ్రీ బాధలు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. సూసైడ్ చేసుకోవడానికి ముందు ఆమె గుడ్ బై చెప్తూ రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిద్రమాత్రలు మింగాక తన స్నేహితురాలికి ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. దాంతో ఆమె వెంటనే జయశ్రీని చెన్నైలోని నీలంగరాయ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. జయశ్రీ భర్త ఈశ్వర్ తాగుబోతట. అతను కూడా బుల్లితెర నటుడే. మహాలక్ష్మి అనే మరో నటితో కలిసి ఈయన ఓ సీరియల్‌లో నటిస్తున్నారు. అలా ఇద్దరి మధ్య సన్నిహితం పెరిగి ఎఫైర్ పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి జయశ్రీ పలుమార్లు ఈశ్వర్‌ను హెచ్చరించారు. అయినా అతను వినలేదు. వినకపోగా జయశ్రీని, కూతుర్ని చిత్రహింసలు పెట్టేవారట. తాగి వచ్చి చావగొట్టేవారని ఓసారి జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. READ ALSO: ఈ మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయితే జయశ్రీ తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజంలేదని ఈశ్వర్ మీడియా ద్వారా వెల్లడించారు. తన నుంచి డబ్బులు తీసుకోవడానికే జయశ్రీ ఇలాంటి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aiM2CH
No comments:
Post a Comment