Monday, 20 January 2020

విధి విలాసం: ‘దొరసాని’ రెండో చిత్రం ప్రారంభం

యాంగ్రీ హీరో రాజశేఖర్, జీవితల చిన్నకూతురు శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయినా ఒక మంచి సినిమాగా నిలిచింది. ‘దొరసాని’ పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు అందుకున్న శివాత్మిక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ హీరో అరుణ్ ఆదిత్, శివాత్మిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘విధి విలాసం’. దుర్గా నరేష్ గుట్టా దర్శకత్వం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. హీరోహీరోయిన్లపై షూట్ చేసిన తొలి సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ కొట్టారు. మరో డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రాన్ని ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శివ దినేష్ రాహుల్, అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్నారు. నిన్నటితరం హీరోయిన్ ఇంద్రజ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళీ, సత్య, అజయ్ ఘోష్, అజయ్, జయప్రకాష్ తదితరులు ఈ చిత్రంలోని తారాగణం. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GiD22V

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....