Sunday, 19 January 2020

`AA 20` టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్‌

అల వైకుంఠపురములో సక్సెస్‌తో ఫుల్ జోష్లో ఉన్న స్టైలిష్ స్టార్‌ షార్ట్‌ గ్యాప్‌ తరువాత తన కొత్త సినిమాను ప్రారంభించనున్నాడు. ఇప్పటికే తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభించాడు బన్నీ. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్ బన్నీ లేకుండానే పూర్తి చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో బన్నీ పాల్గొననున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ రూమర్‌ కొద్ది రోజులుగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్‌ను పరిశీలుస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. సినిమా కథ శేషాచలం అడవుల నేపథ్యంలో రూపొందించింది కావటంతో పాటు సుకుమార్ గత చిత్రం టైటిల్‌ రంగస్థలంకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో శేషాచలం అనే టైటిల్‌కు చిత్రయూనిట్‌ మొగ్గుచూపుతున్నారన్నది వార్త సారాశం. Also Read: అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక టైటిల్‌ విషయంలో జరగుతున్న ప్రచారం అంతా ఒట్టి పుకారేనంటూ కొట్టి పారేశారు. సినిమాకు ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదని, ఫిక్స్‌ అయిన వెంటనే యూనిట్ సభ్యులు అధికారికంగా వెల్లడిస్తారని తెలిపారు. అల్లు అర్జున్‌ 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటించనుంది. ఇక అల వైకుంఠపురం సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే 180 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించిన అల వైకుంఠపురములో బాహుబలి 2 తరువాత ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్‌. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RwGBYq

No comments:

Post a Comment

Exclusive! Hamid Ansari On The Iran War

'To suddenly give the impression of taking a position that is hostile to Iran, or, at least, not friendly to Iran, is not a good thing....