మెగాస్టార్ చిరంజీవి కమెడియన్ అలీని పరామర్శించారు. తల్లి జైతున్ బీబీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు కన్నుమూశారు. ఈ విషయం తెలిసి వెంటనే చిరంజీవి అలీ ఇంటికి వెళ్లారు. కన్నీటి సంద్రంలో మునిగిపోయిన అలీని పరామర్శించారు. బీబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తన తల్లి చనిపోయినప్పుడు అలీ షూటింగ్ నిమిత్తం ఝార్ఖండ్‌లో ఉన్నారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న తన తల్లి ఇక లేదని తెలిసి అలీ కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే ఆయన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలీ తన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు. ముఖ్యంగా తన తల్లి అంటే అలీకి పంచ ప్రాణాలు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తల్లిదండ్రులేనని అలీ చాలా సందర్భాల్లో చెప్పారు. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా తన తల్లితో సమయం గడిపేందుకు ఇష్టపడేవారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PZHNT9
No comments:
Post a Comment