ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే సీనియర్ హీరో మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. తమిళ్‌లో ధనుష్ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా అసురన్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు వెంకీ, తమిళ్‌లో ధనుష్ చేసిన పాత్రలో తెలుగులో వెంకీ కనిపించనున్నాడు. అయితే తమిళ్‌లో ధనుష్ డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో అద్భుతమైన వేరియేషన్ చూపించాడు. కానీ తెలుగులో మాత్రం వెంకీ ఒక్క పాత్రను మాత్రమే చేస్తున్నాడు. తండ్రి పాత్రలో వెంకీ నటిస్తుండగా కొడుకు పాత్రలో ఓ స్టార్ వారసుడు ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. Also Read: దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడ్ని వెండితెరకు పరిచయం చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేయాలని చాలా రోజులగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ సీక్వెల్‌తో డెబ్యూ ఉంటుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ సుమంత్ అశ్విన్ చేతికి వెళ్లింది. తాజాగా అభిరామ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అసురన్ రీమేక్‌తోనే అభిరామ్ వెండితెరకు పరిచయం కానున్నడట. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించనున్నాడు. ఒక కొడుకుగా అభిరామ్ నటిస్తుండగా మరో కొడుకుగా వెంకీ వారసుడు అర్జున్ నటిస్తున్నాడు. వెంకీతో పాటు ఇద్దరు వారసులు కలిసి నటిస్తుండటంతో ఆ సినిమా దగ్గుబాటి మనం అవుతుందా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా ఈ సినిమాతో దగ్గుబాటి వారసుల తెరంగేట్రం దాదాపుగా కన్‌ఫర్మ్ అన్న ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ బాబు, కలైపులి యస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OWcYQ5
No comments:
Post a Comment