మిల్కీ బ్యూటీ తమన్నా.. సూపర్‌స్టార్ మహేష్ బాబును తన ఇంట్లో జరగనున్న పార్టీకి ఆహ్వానించబోతోందట. ఏం పార్టీ అబ్బా.. అనుకుంటున్నారా? నిజంగా కాదులెండి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ కత్తిలాంటి ఐటెం సాంగ్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయబోతోంది. అయితే ఈ పాట.. ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా’ అనే ఫన్నీ లిరిక్స్‌తో ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పాటను షూట్ చేశారట. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారట. అయితే ఈ సినిమాలో ‘మైండ్ బ్లాకు’ అనే పాటను టీం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది తమన్నా నటించిన ఐటెం సాంగ్ ఇదే అనుకున్నారు. కానీ అది తమన్నా ఆడిపాడిన పాట కాదని తెలుస్తోంది. అయితే ‘మైండ్ బ్లాక్’ పాటకు మాత్రం ఎలాంటి హైప్ రావడంలేదు. అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని పాటలకు మాత్రం ఆ రేంజ్‌లో పాపులారిటీ రావడంలేదని ఫ్యాన్స్ దిగులు చెందుతున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో తన మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌ని సంతృప్తి పరుస్తారో లేదో చూడాలి. ఇందులో మహేష్ బాబుకి జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, విజయశాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘హీ ఈజ్ సో క్యూట్’ అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి బాబు థియేటర్లలో ల్యాండవ్వనున్నాడు. మరి ఈ సినిమాతో ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకుంటాడో లేదో వేచి చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38YDLDe
No comments:
Post a Comment