తెలుగులో తొలి సినిమా (అర్జున్ రెడ్డి)తోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నటి . ఈ సినిమా తర్వాత ఆమెకు అన్ని భాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆమె తమిళంలో, తెలుగులో, హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్‌కు సంతకం చేశారు. అయితే షాలిని పాండేపై క్రిమినల్ కేసు నమోదైనట్లు షాకింగ్ వార్త ఒకటి సంచలనం రేపుతోంది. విజయ్ ఆంటోనీకి జోడీగా షాలిని ‘అగ్ని సిరాగుగల్’ అనే సినిమాలో నటించాల్సి ఉందట. ఈ సినిమాకు షాలిని కూడా సంతకం చేసింది. మూడర్ కూడం నవీన్ సినిమాను డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ కేవలం ఇరవై ఏడు రోజులు మాత్రమే పాల్గొన్న షాలిని ఆ తర్వాత సెట్స్‌కు రావడమే మానేశారట. మిగతా సన్నివేశాల్లో నటించనని చెప్పేశారట. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న శివ.. షాలిని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ అవేవీ ఫలించలేదు. దాంతో పారితోషికం తీసుకుని సినిమాకు న్యాయం చేయలేదని శివ తెలుగు, తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో షాలినిపై క్రిమినల్ కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే షాలిని ఇలా ప్రవర్తించడానికి కారణం బాలీవుడ్‌లో అవకాశాలు వస్తుండటమేనని పలు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా షాలిని ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే సినిమాలో నటించే అవకాశం దక్కించారు. తొలి సినిమాలోనే అంతటి సూపర్‌స్టార్ పక్కన నటించే అవకాశం రావడంతో ఆమెకు సౌత్ సినిమాల్లో నటించ బుద్ధి కావడంలేదట. అందుకే ఇక సౌత్ సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా బాలీవుడ్ వైపు ఫోకస్ చేయాలని అనుకుంటున్నారట. దీనిపై షాలిని పాండే నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35QacC3
No comments:
Post a Comment