`చిలసౌ` సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో తన నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు `ఇచ్చట వాహనములు నిలపరాదు` అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా వెల్లడించాడు సుశాంత్. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. చాలా రోజులుగా సరైన కథ కోసం ఎదురుచూస్తున్న ఎస్ దర్శన్ చెప్పిన కథను ఓకే చేశాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌తో పాటు టైటిల్‌తో ఉన్న సైన్ బోర్డ్‌ను చూపించారు. Also Read: ఈ సినిమా ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీ బ్యానర్లపై రవి శంకర్ శాస్త్రి, హరీష్ కోయలగుండ్లలు నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతమివ్వనున్నాడు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణ చైతన్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుశాంత్ సరసన హీరోయిన్‌ను ఫైనల్ చేయాల్సి ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MhF1YF
No comments:
Post a Comment