సినిమా మేకింగ్‌లో మార్పులు వస్తున్న కొద్ది అదే స్థాయిలో సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇటీవల కాస్త బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్ వరకు బాగానే ఉన్నా.. రిలీజ్ సమయానికి సెన్సార్ ఇబ్బందులు కూడా అదే స్థాయిలో కామన్ అయిపోయాయి. కొన్ని సందర్భాల్లో నిర్మాతలు వర్సెస్ లా మారుతుంది పరిస్థితి. ఇటీవల ఇలాంటి వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. వర్మ తెరకెక్కించిన సినిమాలు దాదాపు అన్నీ సెన్సార్ దగ్గర అంతో ఇంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావే. యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన 90 ఎంఎల్ కూడా ఈ సమస్య కారణంగానే ఒకరోజు ఆలస్యంగా విడుదలవుతోంది. తాజాగా లిస్ట్‌లోకి మరో బోల్డ్ స్టార్ వచ్చి చేరారు. Also Read: ఒకప్పుడు శృంగార తారగా సౌత్ ఇండస్ట్రీలని ఏళిన నటి షకీలా. మలయాళ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌లకు కూడా పోటి ఇచ్చిన ఈమె తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి అన్ని సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఫాంలో ఉండగా ఆమె సినిమాలతో పోటి పడేందుకు మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి టాప్ స్టార్లు కూడా భయపడేవారు. ఆ స్థాయిలో ఉండేవి ఆమె సినిమా కలెక్షన్లు. అయితే కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న షకీలా ఇటీవల నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కించారు. `లేడీస్ నాట్ అలవ్డ్` పేరుతో షకీల నిర్మించిన సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. ఇప్పటికే ఈ సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసింది సెన్సార్ బోర్డ్. దీంతో షకీలా సెన్సార్ కమిటీ సభ్యులపై ఫైర్ అవుతోంది. Also Read: ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షకీలా సెన్సార్ కమిటీకి ప్రశ్నలు సంధించారు. `అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఎన్నో సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన కమిటీ నా సినిమా విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తోంది. సినిమాలో నా పేరు ఉండటం మీకు నచ్చేలేదా..? ఎంతో కష్టపడి అప్పులు తీసుకువచ్చి సినిమాను పూర్తి చేశాం. ఇప్పుడు సెన్సార్ చేయడానికి కమిటీ వాళ్లు కూడా డబ్బులు అడిగితే ఎలా` అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ వాళ్లు చిన్న సినిమా నిర్మాతలను మాత్రమే డబ్బులు అడుగుతున్నారని, భారీ చిత్రాల నిర్మాతలను అడిగే ధైర్యం వాళ్లకు లేదని ఆరోపించారు షకీలా. అంతేకాదు తన దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయని, అవసరమైతే వాటిని బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు షకీలా.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34OSLkQ
No comments:
Post a Comment