Sunday, 21 July 2019

బర్త్ డే పార్టీలో ప్రియాంక స్మోకింగ్.. అబద్ధాలకోరు అంటూ ట్రోలింగ్!

బాలీవుడ్ నటి వయసు ఇంకో సంవత్సరం పెరిగింది. జులై 18న ఆమె 37వ ఏట అడుగుపెట్టింది. తన పుట్టినరోజు వేడుకలను అమెరికాలోని మియామి నగరంలో జరుపుకుంది. మియామిలోని సముద్రంలో యాచ్‌(పడవ)పై ఆమె పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకల్లో భర్త నిక్ జోనస్, తల్లి మధు చోప్రా, ఇతర సన్నిహితులతో కలిసి ప్రియాంక ఎంజాయ్ చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, వీటిలో ఒక ఫొటో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రోలింగ్‌కు దారితీసింది. ఈ ఫొటోలో ప్రియాంక చోప్రా సిగరెట్ కాల్చుతోంది. ఆమెతోపాటు భర్త నిక్ జోనస్, తల్లి మధు చోప్రా సిగార్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రియాంకను ఒక ఆటాడుకుంటున్నారు. దీనికీ కారణాలున్నాయి..!! కిందటేడాది ప్రియాంక ఒక అద్భుతమైన సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చింది. దీపావళి నాడు టపాసులు కాల్చవద్దని ప్రజలను కోరింది. ఈ పండుగ మన జీవితాల్లో వెలుగులను నింపుతుందని.. లడ్డూలు, ప్రేమను పంచుతుందని.. అంతేకానీ, కాలుష్యాన్ని కాదని హితబోధ చేసింది. దీన్ని పట్టుకుని ఇప్పుడు నెటిజన్లు ప్రియాంకను ట్రోల్ చేస్తున్నారు. ఇది కాలుష్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు, ఆస్తమాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కిందటేడాది ప్రియాంక నడుం బిగించింది. ఆస్తమాపై ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రచారం చేసింది. దీనిలో భాగంగా తనకు 5 ఏళ్ల వయసులోనే ఆస్తమా వచ్చిందని ప్రియాంక చెప్పింది. అయినప్పటికీ, తాను వెనకడుగు వేయకుండా ఈ స్థాయికి ఎదిగానంటూ స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పింది. ఆ మాటలను ఇప్పుడు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ప్రియాంక అబద్ధాలకోరు అంటూ తిట్టిపోస్తున్నారు. ఆస్తమా ఉంటే సిగరెట్ ఎలా తాగుతున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, స్మోకింగ్ అంటే తనకు గిట్టదని, యాక్ అని 2010లో ప్రియాంక చేసిన ట్వీట్‌ను ఇప్పుడు మళ్లీ బయటికి తీశారు. మొత్తానికి ప్రియాంక అడ్డంగా దొరికిపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Sx3FWT

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD