ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి అద్భుతమైన సినిమాలు తీశారాయన. దిల్ రాజు సినిమా అంటే హిట్టు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, యువ హీరోలందరితోనూ సినిమాలు చేశారు దిల్ రాజు. అయితే, టాలీవుడ్‌కు నాలుగు పిల్లర్లుగా చెప్పుకునే మెగాస్టార్ , నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లలో ఇద్దరితో మాత్రమే దిల్ రాజు సినిమాలు చేశారు. అక్కినేని నాగార్జునతో ‘గగనం’ వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు.. వెంకటేష్‌తో ‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించారు. చిరంజీవి, బాలకృష్ణతో కూడా సినిమాలు నిర్మించాలని దిల్ రాజు కోరికట. అయితే, వీటిలో ఒక కోరిక తీరబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజుతో సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి అంగీకరించారట. ఇటీవల చిరంజీవిని దిల్ రాజు కలిశారని, సినిమా చేయాలని కోరుకుంటున్న విషయాన్ని ఆయనతో చెప్పారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. దిల్ రాజు కోరిక పట్ల చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారట. చిరంజీవి తరవాత సినిమా (153వ సినిమా)ను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. చిరంజీవి ఇటీవలే ‘సైరా’ షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 152వ చిత్రం కోసం చిరంజీవి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JZSP9s
No comments:
Post a Comment