‘బిగ్ బాస్’ రియాలిటీ షో సీజన్ 3 ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. గత వారం రోజులుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతోన్న ‘బిగ్ బాస్’ షో తొలి ఎలిమినేషన్‌కు సిద్ధమైంది. హోస్ట్ అక్కినేని శనివారం హౌజ్‌లోని కంటెస్టెంట్లను మన టీవీ ద్వారా పలకరించి వారిలో జోష్ నింపారు. అయితే, ఎలిమినేషన్ టైమ్ వచ్చిందని నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్ల గుండెల్లో గుబులు పుట్టించారు. మొత్తానికి డేంజర్ జోన్‌లో ఉన్న ఆరుగురిలో ఇద్దరిని సేఫ్ జోన్‌లో వేశారు. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ఆరుగురు సభ్యుల్లో హిమజ, పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు. ఆనందం పట్టలేక హిమజ ఏడ్చేసింది కూడా. డేంజర్ జోన్‌లో మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు రాహుల్, వితికా, జాఫర్, హేమలలో హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోయేది ఎవరో ఆదివారం తెలిసిపోతుంది. ‘బిగ్ బాస్’ అభిమానులు ఎలిమినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సమయంలో సోషల్ మీడియా సెన్సేషన్, వివాదాస్పద నటి హాట్ కామెంట్స్ చేశారు. హోస్ట్ నాగార్జున పాలిటిక్స్ మామూలుగా లేవంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలీవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో. ఇవ్వకపోతే బిగ్ బాస్ గాడు ఒక ఎదవ’’ అని తన పోస్ట్‌లో శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ‘బిగ్ బాస్’పై వివాదం చెలరేగడం, దానిపై నాగార్జున స్పందించిన నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. నిజానికి, శ్రీరెడ్డి ‘బిగ్ బాస్’ షోలోకి వస్తారంటూ ప్రచారం జరిగింది. 15 మంది కంటెస్టెంట్లలో ఆమె పేరు లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో నిజంలేదని శ్రీరెడ్డి పోస్టులు చూస్తుంటే అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌజ్‌లోకి శ్రీరెడ్డి వెళ్లడం నిజమే అయితే ఇలాంటి వివాదాస్పద పోస్టులు ఎందుకు పెడతారు? ఏదేమైనా ఈ పోస్టుల ద్వారా ‘బిగ్ బాస్’ షోకి పరోక్షంగా శ్రీరెడ్డి ప్రచారం కల్పిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JYq2Sn
No comments:
Post a Comment