‘బాహుబలి’ సిరీస్‌తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించారు. ఆయన ప్రతిభ హాలీవుడ్ వరకు వెళ్లింది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన రాజమౌళి.. ‘‘RRR’’ ప్రాజెక్ట్‌తో మరో సెన్సేషన్‌కు తెరలేపారు. ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో సినిమాను ప్రకటించి మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. తరవాత షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ తమిళనాడు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రను పోషిస్తోన్న ఎన్టీఆర్ సరసన ఒక ఇంగ్లిష్ బ్యూటీ హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. సినిమాను ప్రకటించినప్పుడే ఈ పాత్ర కోసం లండన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ పేరును రాజమౌళి ప్రకటించారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తరవాత అమెరికన్ నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను రాజమౌళి ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఎమ్మా కూడా రాజమౌళికి నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చేయడం కోసం ఎక్కువ రోజులపాటు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందట. అన్ని రోజులు తేదీలు ఇవ్వలేకే ఎమ్మా రాబర్ట్స్ తప్పుకున్నట్లు సమాచారం. దీంతో రాజమౌళి మరో ఇంగ్లిష్ భామ కోసం వేట మొదలుపెట్టారని అంటున్నారు. రాజమౌళి అడిగితే చేయము అనే నటీనటులు మన దేశంలో ఉండరు. కానీ, హాలీవుడ్ నటీమణులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడి వచ్చి అన్ని రోజులపాటు పనిచేయాలంటే కష్టమే. బహుశా అందుకే వారు వెనకడుగు వేస్తున్నారేమో! మరో హీరో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZjdgDg
No comments:
Post a Comment