విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల నెలరోజులపాటు కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని వచ్చిన చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతోంది. గత ఫిబ్రవరిలో తూర్పుగోదవారి జిల్లాలో గోదావరి ఒడ్డున ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియనుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్నా ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. ఇలాంటి సమయంలో ఇటు వెంకటేష్ అభిమానులకు, అటు అక్కినేని ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతోన్న షూటింగ్‌లో పాల్గొంటున్న వెంకటేష్, రాశీఖన్నా లుక్స్ లీకయ్యాయి. వెంకటేష్ పంచెకట్టులో అదరగొడుతున్నారు. పంచెలో ఆయన వాకింగ్ స్టైల్ సింప్లీ సూపర్బ్. రాశీఖన్నా పసుపు రంగు లెహెంగాలో చూడముచ్చటగా ఉన్నారు. ఇదిలా ఉంటే, మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తుండటంతో ‘వెంకీ మామ’ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘జై లవ కుశ’ సినిమా హిట్‌తో మంచి జోష్ మీదున్న దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ok9lFg
No comments:
Post a Comment