సెన్సేషనల్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అమ్మాయిల హృదయాలను ఈ యంగ్ హీరో కొల్లగొట్టారు. ఆ తరవాత ‘గీత గోవిందం’తో అమ్మాయిల్లో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’తో విజయ్ క్రేజ్ నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు పాకేసింది. విజయ్ కోసం కేవలం తెలుగు అమ్మాయిలే కాదు తమిళం, కన్నడ, మలయాళం అమ్మాయిలు పడిచచ్చిపోతున్నారు. దీనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోనే సాక్ష్యం. తన అభిమాన హీరో విజయ్ దేవరకొండను అకస్మాత్తుగా చూసిన ఒక అమ్మాయి ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆయన్ని గట్టిగా హత్తుగా ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏడుస్తోన్న తన అభిమానిని దగ్గరకు తీసుకుని విజయ్ ఓదార్చారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది అనే విషయంలో స్పష్టత లేదు. బహుశా ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుని ఉండొచ్చు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రచారంలో భాగంగా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోనూ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లో ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ జరిగాయి. అయితే చెన్నై, బెంగళూరు, కొచ్చి.. ఈ మూడు నగరాల్లో ఏదో ఒక చోటుకి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఈ వీడియో విజయ్ క్రేజ్‌కు అద్దం పడుతోంది. దగ్గరకు వచ్చిన అభిమానిని అవైడ్ చేయకుండా విజయ్ దేవరకొండ ఓదార్చడం అందరినీ ఆకట్టుకుంటోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ygKKGA
No comments:
Post a Comment