‘ఏడు చేపల కథ’ అనే అడల్ట్ కామెడీ ఫిల్మ్ గుర్తుంది కదా..! కిందటేడాది వచ్చింది. ఆ సినిమాలో టెంప్ట్ రవి.. తాను టెంప్ట్ అయిపోయి, సినిమా చూస్తున్న ప్రేక్షకులను కూడా బాగా టెంప్ట్ చేసేశాడు. శృతిమించిన శృంగారం, డబుల్ మీనింగ్ డైలాగులతో బూతు సినిమా చూపించేశాడు. ఇప్పుడు మరో సినిమాతో బూతు పురాణానికి సిద్ధమైపోయాడు. ఇంతకీ ఈ టెంప్ట్ రవి పాత్రలో నటించిన హీరో అభిషేక్ రెడ్డి. మళ్లీ ఆయనే హీరోగా.. గుంజన్, ఫిదా గిల్, కావ్య హీరోయిన్లుగా ‘వైఫ్, ఐ’ అనే సినిమా వస్తోంది. ఇది కూడా అడల్ట్ సినిమానే. ‘వైఫ్, ఐ’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలోనూ శృంగారం శృతిమించిపోయింది. బ్లూ ఫిల్మ్‌ను తలపిస్తోంది. మొగుడు కళ్లుగప్పి పెళ్లాం చేసే రాసలీలలు ఈ సినిమాలో చూపించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. దీనికి తోడు పోస్టర్లపై ‘నైఫ్ ఈజ్ బెటర్ దేన్ వైఫ్’ అని రాశారు. అంటే, పెళ్లాం కంటే కత్తె మేలట. ఇంతలా ఏం చేసిందో ఈయనగారి పెళ్లాం. టీజరే ఇంత ఘాటుగా ఉందంటే, ఇక సినిమాలో అన్నీ చూపించేస్తారనుకుంటా. ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జి.చరితారెడ్డి నిర్మిస్తున్నారు. రచన, కెమెరా, డైరెక్షన్, ఎడిటింగ్ జీఎస్ఎస్‌పీ కళ్యాణ్. వినోద్ యాజమన్య సంగీతం సమకూర్చారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్ట, అపర్ణ ఇతర పాత్రల్లో నటించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32ZDMnC
No comments:
Post a Comment