Monday, 29 July 2019

‘నా... లోనా’ అంటూ తీయని మెలోడీతో వచ్చిన మన్మథుడు

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇచ్చిన పాటలవి. ఈ సినిమా మ్యూజిక్‌తో దేవీకి కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ‘మన్మథుడు 2’ పాటలతో మరో కొత్త సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్‌కు మంచి గుర్తింపు వస్తుందనిపిస్తుంది. ‘RX 100’ సినిమాతో పరిచయమైన చైతన్ భరద్వాజ్.. ‘పిల్లా రా’ పాటతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టారు. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ‘మన్మథుడు 2’కు కూడా మంచి మెలోడీలు కంపోజ్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ నుంచి రెండో పాట విడుదలైంది. ‘నా... లోనా’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ఈ తీయని మెలోడీని ఈ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద ఆలపించారు. శుభం విశ్వనాథ్ సాహిత్యం అందించారు. ఈ మెలోడీ సాంగ్‌ను విన్న అక్కినేని అభిమానులు తమ మన్మథుడు హిట్టు కొట్టడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇటీవల విడుదలైన ‘హే మెనీనా’ సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ రెండో పాట అద్భుతంగా ఉండటంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2K3TlBO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....