Friday, 26 July 2019

Uppal Balu: శ్రీరెడ్డితో ఉప్పల్ బాలు ‘కసి’ .. ఏం తిప్పుతున్నార్రా బాబోయ్

సరిపోయింది సంబరం.. ఇద్దరికీ ఇద్దరే.. ఒకరేమో కాంట్రవర్శీ అండ్ హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. ఇంకొకరేమో టిక్ టాక్ యాప్‌కే హార్ట్ ఎటాక్ రప్పించే మెలికల మాంత్రికుడు. వీళ్లిద్దరే , . శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి, తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు సుపరిచితమే. చేసినవి రెండు మూడు సినిమాలే అయినా.. ఆమె టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌తో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోని రసిక రాజులకు వణుకు పుట్టించింది. ఎప్పుడూ ఏదో సంచలన వార్తతో వార్తల్లో ఉండే శ్రీరెడ్డికి ఫేస్ బుక్‌లో ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఉప్పల్ బాలు.. నాకు చాన్స్ వస్తే ‘నా కసి మొత్తం చేర్చేసుకుంటా’ అంటూ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఉప్పల్ బాలు... టిక్ టాక్‌కే తోపులా మారాడు. అటు అమ్మాయి.. ఇటు అబ్బాయి అని కాకుండా అమ్మాయి అబ్బాయిని మిక్స్ చేసి వీరలెవల్లో ‘కసి’ ఫెర్ఫామెన్స్ ఇస్తూ వీడియోలు వదలుతుంటాడు. ఈ మధ్య జబర్దస్త్ కార్యక్రమంలోనూ తన ‘కసి’ చూపించేశాడు. ఈ ఇద్దరూ కలిసి ఓ వీడియో వదిలారు. ఈ వీడియోను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది శ్రీరెడ్డి. ఇద్దరూ మెలికలు తిరుగుతూ.. నడుముని బొంగరం గింగిరాలు తిప్పుతూ హుషారైన పాటకు ఊపునిచ్చే స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తూ టిక్ టాక్ వీడియో రూపొందించారు. అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నంత రేంజ్‌లో ఈ వీడియో వీడియో ఉంది. ఈ రచ్చపై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32RH3VY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....