రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా కపూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా కపూర్‌ను తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరని అడిగారు. వెంటనే శ్రద్ధా సూపర్ స్టార్ పేరు చెప్పారు. ప్రభాస్ గురించి అడిగినప్పుడు అతను తనకు మంచి స్నేహితుడని వెల్లడించారు. శ్రద్ధా కపూర్ ఇచ్చిన ఈ సమాధానాలు ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి లోను చేశాయట. వాస్తవానికి ఒక హీరోతో నటిస్తున్నప్పుడు ఆయనే తన అభిమాన నటుడని హీరోయిన్ చెప్పాలని ఆ హీరో అభిమానులు కోరుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. శ్రద్ధాకపూర్ మహేష్‌బాబును ఇష్టపడుతున్నంత మాత్రాన ప్రభాస్ క్రేజ్ ఏమైనా తగ్గిపోతుందా? కానీ, శ్రద్ధా కపూర్ చెప్పిన సమాధానం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. కాగా, ‘సాహో’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ విడుదల చేస్తున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి పాటలు అందిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, లాల్, చంకీ పాండే, మందిరా బేడి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LNuGoB
No comments:
Post a Comment