సినీ నటుడు, టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ సన్నిహితుడైన శివాజీకి అధికారులు షాకిచ్చారు. టీవీ9 వాటాల కొనుగోలు వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంతో.. ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో దుబాయ్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని సూచించారు. దుబాయ్ మీదుగా అమెరికా వెళ్తున్నారని తెలుస్తోంది. గత నెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లడానికి శివాజీ ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టీవీ9 యాజమాన్యం అలంద మీడియా కేసులో శివాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రవి ప్రకాశ్ టీవీ9 సీఈఓగా ఉన్న సమయంలో సంతకాలు ఫోర్జరీ చేశారని.. ఆ ఛానెల్‌లో మెజార్టీ వాటాలు దక్కించుకున్న అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో శివాజీకి కూడా ప్రమేయం ఉన్నట్టు ఆరోపించింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు దేశం దాటి పోవద్దంటూ ఆంక్షలు విధించారు. తర్వాత ఆయనపై ఆంక్షలను తొలగించారు. ఏపీ ఎన్నికలకు చాలా రోజుల ముందే.. ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’కు శ్రీకారం చుట్టిందని శివాజీ ఆరోపించారు. ఆ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుందనేది ఆయన పూసగుచ్చినట్టుగా వివరించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32VPNdy
No comments:
Post a Comment