సూపర్ స్టార్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. ఇటీవల మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మహేష్.. ఇప్పుడు బట్టల వ్యాపారంలోకి దిగారు. మహేష్‌బాబు సొంతంగా క్లోతింగ్ బ్రాండ్‌ను స్థాపించనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ తన క్లోతింగ్ బ్రాండ్‌ను మహేష్‌బాబు ప్రకటించారు. ‘ది హంబల్ కో.’ పేరుతో గార్మెంట్ బ్రాండ్‌ను మహేష్ స్టాపించారు. ఆగస్టు 7న దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని మహేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా హంబుల్ ప్రయత్నాన్ని ఈరోజు ప్రకటిస్తున్నాం. అద్భుతంగా స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. ది హంబుల్ కో. కేవలం క్లోతింగ్ మాత్రమే కాదు, ఇదొక జీవన విధానం. ది హంబుల్ కంపెనీ కుటుంబంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఆగస్టు 7న ప్రారంభోత్సవం కోసం వేచి చూస్తూ ఉండండి’ అని మహేష్‌బాబు ట్వీట్ చేశారు. కంపెనీ లోగో, కొత్త దుస్తుల్లో మహేష్‌బాబు లుక్‌ను కూడా విడుదల చేశారు. ‘‘HUMBL’’ అనే లోగోలో ‘‘MB’’ని అండర్‌లైన్ చేశారు. అంటే మహేష్‌బాబు అనే అర్థం వచ్చేలా లోగోను డిజైన్ చేశారు. కాగా, ప్రస్తుతం మహేష్‌బాబు ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే కశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్.. త్వరలో హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SMHrjP
No comments:
Post a Comment