Monday, 29 July 2019

వాళ్లకు సెక్స్, హగ్గులు, ముద్దులే కావాలి.. ‘బిగ్ బాస్’ షోపై శ్వేతారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

జర్నలిస్ట్, టీవీ యాంకర్ శ్వేతారెడ్డి ‘బిగ్ బాస్’ రియాలిటీ షోపై మరోసారి విరుచుకుపడ్డారు. తీవ్ర ఆరోపణలు చేశారు. అగ్రిమెంట్ల పేరుతో సుమారు 150 మందితో బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపారని, వాళ్లందరినీ మోసం చేశారని ఆరోపించారు. బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పోరాడుతోన్న శ్వేతారెడ్డి సోమవారం విశాఖపట్నంలో మహిళా మండలి సభ్యుల సౌజన్యంలో ధర్నా తలపెట్టారు. అయితే, అక్కడ వాతావరణం సహకరించకపోవడంతో ధర్నాను రద్దుచేసి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్వేతారెడ్డి మాట్లాడుతూ బిగ్ బాస్ షోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎంపిక విషయంలో అన్యాయం జరగడం ఒక్కటేకాదు.. వాళ్లు లేవదీసిన ప్రశ్నలు కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. నా విషయానికి వస్తే మీరు మా బాస్‌ను ఎలా సాటిసిఫై చేస్తారు అని అడిగారు. శ్యామ్ అనే ఒక ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తడం నాకు చికాకు తెప్పించింది. నా శరీరం గురించి, నా శరీర బరువు గురించి ప్రశ్నలు అడగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అదొక రియాలిటీ షో, టాలెంట్ షో. అక్కడ ఎవరి టెంపర్ ఎలా ఉంటుంది.. మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది.. టాస్క్‌లు ఇచ్చినప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది.. వీటిపై ప్రశ్నలు సంధించాలి. అంతేకానీ.. సెక్సుల గురించి, హగ్గుల గురించి, ముద్దుల గురించి అడగడమేంటి. 90 రోజులపాటు సెక్స్ లేకుండా మీరు ఎలా మేనేజ్ చేయగలరు. హౌజ్‌లోని వేరే వ్యక్తితో మీరు ముద్దులు పెట్టుకోవడానికి, హగ్స్ ఇచ్చుకోవడానికి, ఎఫైర్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు అడిగారు. నాతోపాటు గాయత్రి గుప్తాను, శ్రీరెడ్డిని కూడా ఈ ప్రశ్నలు అడిగారు. నా విషయంలో శ్యామ్ ఇలాంటి ప్రశ్నలు అడిగితే.. మిగిలిన వాళ్లను ముంబై హెడ్ అభిషేక్ గుప్తా అడిగారు. ఈ పోరాటం చాలా తీవ్ర రూపం దాల్చబోతోంది. కొంత మంది అంటున్నట్టు ఇది పబ్లిసిటీ స్టంటో, ఒక ప్రమోషనల్ యాక్టివిటీనో అయ్యుంటే ఇది హైదరాబాద్‌కే పరిమితమయ్యేది. కానీ, హైదరాబాద్ బోర్డర్ దాటి వైజాగ్‌కు వచ్చింది. మున్ముందు ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రం చేయబోతున్నాను’’ అని శ్వేతారెడ్డి వెల్లడించారు. ఈ షోకు హోస్ట్‌గా ఉన్న నాగార్జునకు కూడా శ్వేతారెడ్డి ప్రశ్నలు సంధించారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న నాగార్జున ఇలాంటి షోకు బ్రాండింగ్ ఇస్తూ సభ్యసమాజానికి ఆయన ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ వంటి గొప్ప సినిమాలు చేసిన నాగార్జున ఈ బూతు షో నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Kc8od0

No comments:

Post a Comment

'Women In Paatal Lok Rarely Cry'

'No woman is stronger than one who acknowledges her vulnerabilities.' from rediff Top Interviews https://ift.tt/nduI8wb