Sunday, 28 July 2019

కాకినాడలో ‘రణరంగం’.. అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణ!

శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే, చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి, సినిమాపై అంచాలను పెంచడానికి ప్రీ రిలీజ్ వేడుకను త్వరలోనే నిర్వహిస్తున్నారు. తాజా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ‘రణరంగం’ ప్రీ రిలీజ్ వేడుకను ఆగస్టు 4న కాకినాడలో నిర్వహిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ‘రణరంగం’ సినిమాను అత్యధిక భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. దీంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అక్కడే నిర్వహించాలని నిర్ణయించారట. ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే కాకినాడలో ఆగస్టు 4న పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కాగా, ‘కేశవ’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలోని ‘పిల్లా పిక్చర్ పర్‌ఫెక్ట్’ అనే పాటను సోమవారం విడుదల చేస్తున్నారు. ఈ పాటలో కాజల్ చాలా హాట్‌గా కనిపించనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Onecpl

No comments:

Post a Comment

'Women In Paatal Lok Rarely Cry'

'No woman is stronger than one who acknowledges her vulnerabilities.' from rediff Top Interviews https://ift.tt/nduI8wb