Sunday, 21 July 2019

కాజల్ చర్మ సౌందర్యానికి కారణం ఇదా..!!

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబై బ్యూటీ.. కృష్ణవంశీ ‘చందమామ’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్ ‘చందమామ’గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరితోనూ వరసపెట్టి సినిమాలు చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు 12 ఏళ్లు గడిచినా ఇంకా తన ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉంది. తన అందచందాలు, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే, తన చర్మ సౌందర్యం వెనకున్న రహస్యం గురించి తాజాగా కాజల్ వెల్లడించింది. తన చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి ఒక న్యూట్రిషనల్ ప్రొడక్ట్ కారణమంటోంది. ఈ మేరకు ఆ న్యూట్రిషన్ సంస్థ ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాజల్ చెప్పుకొచ్చింది. ‘ఐదేళ్ల క్రితం, నా ఫ్రెండ్ ఒకరు నన్నొక మాట అడిగారు. ఆరోగ్యవంతమైన చర్మం కోసం న్యూట్రిషన్ ప్రొడక్ట్‌ను ట్రై చేయాలని నేను అనుకుంటే గనుక, ఆయన స్టార్టప్ దీనిపైనే పనిచేస్తుందని, దాన్ని వాడి ఎలా ఉందో చెప్పాలని కోరారు. అప్పటి నుంచి నా దినచర్యలో ఇది స్థిరంగా ఉండిపోయింది. న్యూట్రోవా సాధించిన క్లినికల్ స్టడీ ఫలితాలకు అభినందనలు. 2014 నుంచి నా చర్మ సౌందర్యాన్ని ఇది మాత్రమే కాపాడింది. మీరూ కొనండి’ అని కాజల్ పేర్కొంది. వాస్తవానికి ఇది న్యూట్రోవా ప్రచారంలో భాగంగా కాజల్ చేసిన పోస్ట్. కానీ, ఇదే కాజల్ చర్మ సౌందర్యానికి కారణమట.. నిజమేనా!!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LZyCSx

No comments:

Post a Comment

'Don't Compel Us To Study Hindi!'

'We are not opposed to any Indian language. We are against Hindi imposition.' from rediff Top Interviews https://ift.tt/m1ozKQM