Sunday 21 July 2019

Jabardasth Vinodini: నిన్న చంపబోయారు.. ఈరోజు నీళ్లు ఆపేశారు: జబర్దస్త్ వినోదిని ఆవేదన

ఇంటి ఓనర్ దాడితో తీవ్రంగా గాయపడ్డ జబర్దస్త్ కమెడియన్ వినోద్‌ (వినోదిని) తనకు ప్రాణహాని ఉందంటున్నాడు. ఓ ఇల్లు కొనుగోలు వ్యవహారంలో తనను పిలిపించి హత్నాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన వినోద్ తీవ్రగాయాలపాలైన విషయం తెలిసిందే. కాగా నిన్న తనను చంపేందుకు ప్రయత్నించి.. ఈరోజు తన ఇంటికి నీళ్లు రాకుండా ఆపేశారని ఆవేదన చెందారు వినోద్. ఈ సందర్భంగా ఈ గొడవకు గల కారణాన్ని వివరించారు. ‘నేను ఇంటి కోసం మార్చి 16న ఓనర్స్‌కి రూ. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. మేం అడ్వాన్స్ ఇచ్చిన తరువాత ఇంటిని రెండుగా డివైడ్ చేయడానికి కనస్ట్రక్ట్ చేయాలి. కాని నెలన్నరైనా ఇంటిని ఖాళీ చేయలేదు. మేం చెప్పగా చెప్పగా చివరికి ఇంటిని ఖాళీ చేయించారు. తీరా ఇంటి పని మొదలు పెట్టాక.. ఇంటిని సమానంగా కొలవలేదు. వాళ్లకంటే మా స్థలం తక్కువగా ఉంది. తక్కువగా ఉందని అడిగితే.. మేం ఇంతే ఇస్తాం అని తిరగబడ్డారు. కొన్నాళైన తరువాత ఇక ఇంటిని ఇవ్వము.. డబ్బులు కూడా ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నన్ను హెచ్చరించారు. దీంతో నేను ఈ ఏరియా కార్పొరేటర్ దగ్గరకు వెళ్లాను. ఆయన వీళ్లను పలిపించి మందలించారు. వాళ్లకు ఇళ్లు అయినా ఇవ్వండి లేకుంటే డాక్యుమెంట్స్‌లో ఉన్నట్టుగా రూ. 10 లక్షలు ఇచ్చారు కాబట్టి రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చేయమని చెప్పారు. అమ్ముతానని డబ్బు తీసుకుని ఇప్పుడు అమ్మనని చెప్పడం తప్పు అని వాళ్లని మందలించారు. దీంతో వాళ్లు నన్ను మాట్లాడదాం అని పిలిచి మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంటి ఓనర్ ప్రమీల, భర్త బాలాజీ, పెద్ద కొడుకు ఉదయ్ సాగర్, చిన్న కొడుకు అభిషేక్, పెద్ద కోడలు సంధ్య నన్ను కొట్టారు. బాలాజీ నన్ను కొట్టి చంపబోయాడు. నాలుక తెగేలా కొట్టారు. పీక నొక్కి చంపబోయారు. నా డబ్బులు తీసుకుని మోసం చేసిందే కాకుండా నాపై హత్యాయత్నం చేశారు. ఈరోజు మా ఇంటికి వాటర్ కూడా రాకుండా నీటిని బంద్ చేశారు. మమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తున్నారు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు జబర్దస్త్ వినోదిని. కాగా వినోదిని పై దాడి చేసిన ఇంటి ఓనర్‌పై కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M4qfoS

No comments:

Post a Comment

When Can Speaker Expunge MPs' Remarks?

'Expunging remarks is within the powers of the Speaker.' from rediff Top Interviews https://ift.tt/Si5j4cE