Monday, 10 July 2023

Thaman - సయధరమ తజ కననళల పటటకననడ: థమన

‘బ్రో’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి సాయిధరమ్ తేజ్ కన్నీళ్లు పెట్టుకున్నారని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ అన్నారు. బయట పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ మధ్య ఎంత మంచి అనుంబంధం ఉంటుందో.. అది తెర మీద మనకు కనిపిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో మీడియాతో థమన్ ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/bTcIpFs

No comments:

Post a Comment

'Why Would Govt Be Scared Of Cartoonists?'

'Journalists must ask the Mumbai police why are they sending notices via X to cartoonists.' from rediff Top Interviews https://ift...