ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ వైద్యభరితమైన పాత్రలు పోషించే సీనియర్ హీరో నిన్న (ఏప్రిల్ 2) 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు నూతన దర్శకుడు అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహించారు. నాగ్ సరసన దియా మీర్జా హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్ పరంగా సక్సెస్ కావడంతో తొలిరోజు ఈ సినిమాకు చెప్పుకోదగిన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్ర పోషించిన నాగార్జున ప్రధాన బలం అనే టాక్ వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 8.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'వైల్డ్ డాగ్' సినిమాకు ఫస్ట్ డే రెస్పాన్స్ బాగానే వచ్చింది. అనుకున్నట్లుగానే నాగార్జున క్యారెక్టర్ సినిమాకు ప్రధాన బలమని రివ్యూస్ వచ్చాయి. కాకపోతే ఆశించిన మేర కలెక్షన్స్ మాత్రం నమోదు కాలేదు. తొలి రోజుకు గాను ఈ మూవీ 1.33 షేర్, 2.60 కోట్ల గ్రాస్ రాబట్టింది వైల్డ్ డాగ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.21 కోట్ల షేర్, 2.35 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఏరియాల వారిగా రిపోర్ట్ చూస్తే.. నైజాం- 53 లక్షలు సీడెడ్- 19 లక్షలు ఉత్తరాంధ్ర- 16 లక్షలు ఈస్ట్ గోదావరి- 7 లక్షలు వెస్ట్ గోదావరి- 6 లక్షలు గుంటూరు- 7 లక్షలు కృష్ణా- 8 లక్షలు నెల్లూరు- 5 లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా 6 లక్షలు ఓవర్సీస్ 6 లక్షలు ప్రస్తుతం కోవిడ్ ఉదృతి కొనసాగుతుండటం ఈ సినిమా కలెక్షన్స్‌పై కాస్త ప్రభావం చూపెట్టిందని తెలుస్తోంది. 9 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 8 కోట్లకు పైగా రాబడితే సేఫ్ జోన్ లోకి వెళుతుంది. సో.. చూడాలి మరి రానున్న రోజుల్లో 'వైల్డ్ డాగ్' హవా ఎలా నడుస్తుందనేది!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cIjea2
No comments:
Post a Comment