చర్యలు ఊహాతీతం. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా ప్రవర్తిస్తుందో.. ఎప్పుడు కొత్త పదాలను కనిపెడుతుంటారో చెప్పడం చాలా కష్టం. మంచు లక్ష్మీ వేసే ట్వీట్లు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యే సెలెబ్రిటీల్లో మంచు లక్ష్మీ కూడా ఉంటారు. అయితే తనపై వచ్చే ట్రోలింగ్‌ను మంచు లక్ష్మీ ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకుంటారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్ గురించి అందరి ముందే నిర్మోహమాటంగా మాట్లాడేస్తుంటారు. కరోనా అంటూ ఆర్‌ను ఎలా పలకాలో చెప్పిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక నిలదీస్‌ఫై అంటూ వెరైటీ పదాన్ని సృష్టించడం కూడా ఓ సెన్సేషన్ అయింది. అలా మంచు లక్ష్మీ మీద నిత్యం ఏదో రకమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక నిన్న మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ సెన్సేషన్ అయింది. కరోనా వచ్చి కేటీఆర్ బాధపడుతూ ఉంటే.. ఓదార్చింది పోయి... నా సినిమాలు చూడు అంటూ మంచు లక్ష్మీ వేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. నీ సినిమాల కంటే కరోనాయే బెటర్.. నీ సినిమాలు చూస్తే నిజంగానే పోతాడు అని నానా రకాలుగా ట్రోల్ చేశారు. ఇక ఓ రాష్ట్ర మంత్రిని బడ్డీ అంటూ పిలవడం, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం కనీస మర్యాద ఇవ్వవా? అని కేటీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అయితే తాజాగా మంచు లక్ష్మీ వేసిన మరో ట్వీట్ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. పీసీఆర్ టెస్ట్ విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త థామస్ బ్రాక్ మరణించారు. ఈ విషయంపై న్యూయార్క్ టైమ్స్ ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌ను మంచు లక్ష్మీ రీపోస్ట్ చేస్తూ ఓ కామెంట్ చేశారు. వావ్ అంటూ మనిషి చనిపోయిన విషయంపై కూడా వెరైటీగా స్పందించారు. రిప్ సర్ మీ సేవలకు ధన్యవాదాలు అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు. మనిషి చనిపోతే వావ్ అనడం ఏంటి అంటూ మంచు లక్ష్మీని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. పీసీఆర్ టెస్ట్ విధానాన్ని కనుకున్నాడని అందుకే మంచు లక్ష్మీ వావ్ అని ఉంటుందని కొంత మంది ఆమెను సమర్ధిస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం వావ్ అనడం ఏంటి?మనిషి చనిపోతే అలా అనడం కరెక్టా? అని రకరకాలు ట్వీట్లు పెడుతూ మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vfiTlx
No comments:
Post a Comment