Saturday, 24 April 2021

ఆ రెండూ పోవడంతో విస్కీనే ప్రాణంగా బ్రతుకున్నా.. అది లేకుండా ఉండలేనంటూ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

అనగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తొచ్చేది ఆల్కహాల్. కానీ ఇక్కడ విస్కీ అంటే ఆల్కహాల్ కాదు పెంపుడు కుక్క. చాలామంది సెలబ్రిటీస్ పెంపుడు కుక్కలపై ఎంతో ప్రేమ చూపిస్తుంటారు. ముఖ్యంగా నేటితరం హీరోయిన్స్ అయితే పెట్స్ అంటే పడి చస్తుంటారు. ఏ మాత్రం వీలు కుదిరినా ఆ పెట్స్‌తోనే సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆయా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరోయిన్ తన పెంపుడు కుక్క గురించి మాట్లాడుతూ దానిపై ఉన్న ప్రేమను బయటపెట్టింది. తనకు పెట్ డాగ్ 'విస్కీ' అంటే చాలా చాలా ఇష్టం అంటూ తన పెంపుడు కుక్కను అందరికీ పరిచయం చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ విస్కీకి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా దానితో ఉన్న అనుబంధాన్ని తెలిపింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. అంతేకాదు విస్కీ నాలుగో పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ మేరకు విస్కీతో పాటు జన్మించిన మరో రెండు పెట్ డాగ్స్ తాడి, రమ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఈ రెండు పెట్ డాగ్స్ గతేడాది మరణించాయని, ఇప్పుడు విస్కీనే ప్రాణంగా చేసుకుంటున్నానని చెప్పింది. సినిమాల సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది అనుపమ. అందాల ఆరబోతకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండానే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న ఈ బ్యూటీ చివరగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన 'రాక్షసుడు' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం '18 పేజెస్' మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eukRrt

No comments:

Post a Comment

'This Roller Coaster Has Taught Me To...'

'...just be neutral about everything.' from rediff Top Interviews https://ift.tt/p3n6AQF