Saturday, 24 April 2021

రిలీజ్‌కి ముందే కే.జీ.ఎఫ్-2 రికార్డుల సునామీ.. సినిమా క్రేజ్ మామూలుగా లేదుగా..

కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కే.జీ.ఎఫ్-ఛాప్టర్ 1’ ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. దక్షిణాది ప్రేక్షకులనే కాదు యావత్ భారత సినీ అభిమానులను ఆకట్టుకుంది ఈ సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్, మాస్ ఎలివేషన్స్, భారీ సెట్టింగ్స్ ఇలా ప్రతీ విషయంలోనూ ఏ మాత్రం తగ్గకుండా సినిమాని తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాక.. హీరో యశ్‌కి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. త్వరలో ఈ సినిమా సీక్వెల్ ‘కే.జీ.ఎఫ్-ఛాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన కే.జీ.ఎఫ్-2 టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీజర్‌ ఈ రేంజ్‌లో ఉంటే.. సినిమా ఇంకే రేంజ్‌లో ఉంటుందా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. పరిస్థితులు అనుకూలిస్తే.. ఈ ఏడాది జూలై 16న కే.జీ.ఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే టీజర్‌తో పలు రికార్డులు సాధించిన.. కే.జీ.ఎఫ్-2 తాజాగా మరో అరుదైన రికార్డును సాధించింది. ఈ సినిమా విడుదల కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారనే విషయానికి సంబంధించి ఓ ఆసక్తికర అంశం తాజాగా బయటపడింది. ప్రముఖ టికెట్ బుక్కింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌ మై షోలో ఈ సినిమాను చూసేందుకు దాదాపు 3లక్షలకు పైగా మంచి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతంలో ఏ సినిమా సాధించని రికార్డును కే.జీ.ఎఫ్-2 సాధించింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతోంది. కే.జీ.ఎఫ్ మొదటి ఛాప్టర్ ముగిసిన సందర్భం నుంచి రెండో ఛాప్టర్‌లో కథ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా.. రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రవి బసుర్ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sMyLdC

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw