బాక్సాఫీస్ వద్ద '' సృష్టిస్తున్న అలజడి మామూలుగా లేదు. డైరెక్టర్ బుచ్చిబాబు, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ ముగ్గురూ కూడా తొలిసినిమా తోనే తమకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకొని సత్తా చాటుతున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఉప్పెన' మూవీ నేటికీ స్పీడు తగ్గించడం లేదు. నిర్మాతలను లాభాల బాటలో తీసుకెళ్తూ వసూళ్ల హవా నడిపిస్తోంది. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీకి కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో 'ఉప్పెన'కు 100 కోట్లు అంటూ తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతలు 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని తెలిపారు. ''ఓ మంచి కంటెంట్ ఉన్నా సినిమాను ఏదీ ఆపలేదని మరోసారి ఈ ఉప్పెనతో రుజువైంది. మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దీంతో మెగా మేనల్లుడు , హీరోయిన్ కృతి శెట్టికి పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. నిజానికి 'ఉప్పెన' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే ఈ మూవీ వంద కోట్ల సినిమా అవుతుందని ఎంతో ధీమాగా అన్నారు సుకుమార్. రిలీజ్ డే మొదటి ఆట ముగిశాక మరోసారి అదే మాట చెప్పారు. ఇక ఇప్పుడు అదే నిజమంటూ మైత్రి నిర్మాతలు ప్రకటించారు. చిత్రంలో విజయ్ సేతుపతి రోల్ మేజర్ అట్రాక్షన్ కాగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు టేకింగ్, హీరోహీరోయిన్ కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాయి. దేవీ శ్రీ బాణీలు 'ఉప్పెన'కు మరింత బలం చేకూర్చి సినిమాను ఈ స్థాయిలో నిలబెట్టాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qlQO9p
No comments:
Post a Comment