యంగ్ హీరో సందీప్ కిషన్ 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'A1 ఎక్స్‌ప్రెస్' తొలిరోజే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మార్చి 5వ తేదీ (శుక్రవారం) విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల ఊహించిన రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే తొలిరోజు ఈ సినిమాకు 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూస్తే సందీప్ కిషన్ కెరీర్‌లో ఇది చెప్పుకోదగిన ఫీట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ రిపోర్ట్.. నైజాం- 24 లక్షలు సీడెడ్- 8 లక్షలు ఉత్తరాంధ్ర- 10 లక్షలు ఈస్ట్ గోదావరి- 8 లక్షలు వెస్ట్ గోదావరి- 5.8 లక్షలు గుంటూరు- 7.2 లక్షలు కృష్ణా- 7.1 లక్షలు నెల్లూరు- 5.5 లక్షలు స్పోర్ట్స్ డ్రామాగా హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు విడుదలకు ముందే పాజిటివ్ బజ్ నెలకొనడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ 4.6 కోట్ల మేర జరిగింది. దీంతో 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజు ఫర్వాలేదనిపించింది. ఇక వరుసగా రెండు, మూడు రోజులు సెలవు దినాలు కావడంతో నేడు, రేపు కలెక్షన్స్‌కి డోకా ఉండకపోవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ సినిమాను నిర్మించారు. డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు. చిత్రంలో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించగా.. మురళీ శర్మ, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bnOWZD
No comments:
Post a Comment