పవర్ స్టార్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ ఛాన్స్ పట్టేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్‌తో దిగిన ఓ సెల్ఫీ ఫొటో షేర్ చేస్తూ తాను పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించబోతున్నట్లు ప్రకటించింది హిమజ. పవన్- క్రిష్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో స్పెషల్ పోస్ట్‌తో అట్రాక్ట్ చేసింది ఈ బుల్లితెర బ్యూటీ. తనకు పవన్ కళ్యాణ్ ఓ లెటర్ ఇచ్చారని తెలుపుతూ ఆ లెటర్‌ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ లెటర్‌లో ''హిమజ గారికి అన్నీ శుభాలు కలగాలని, ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ.. పవన్ కళ్యాణ్'' అని రాసి ఉంది. ఈ పదాలు స్వయంగా పవన్ తన చేతి రాతతో రాశారట. దీంతో ఈ కాగితాన్ని అభిమానులతో పంచుకుంటూ గాల్లో తేలిపోయింది హిమజ. ఇది చూశాక నా ఫీలింగ్స్ వ్యక్తపరిచేందుకు ఎలాంటి పదాలు, ఎమోజీలు సరిపోవంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచమైన హిమజ.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెల్లగా వెండితెరపై అవకాశాలు అందుకుంటూ ''శివమ్, నేను శైలజ, ధృవ, శతమానంభవతి, స్పైడర్, ఉన్నది ఒకటే జిందగీ, వినయ విధేయ రామ, చిత్రలహరి'' లాంటి ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. అదేవిధంగా బిగ్ బాస్ మూడో సీజన్‌లో హంగామా చేసి తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 27వ సినిమాలో నటించే అవకాశం కొట్టేయడమే గాక.. 'జ' అనే మరో మూవీలో హీరోయిన్‌గా లీడ్ రోల్ పోషిస్తోంది. జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రతాప్ రాజ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో హిమజ పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించి ఆకట్టుకుంది హిమజ. సో.. చూడాలి మరి పవన్ కోరుకున్నట్లు ప్రొఫెషనల్‌గా ఆమె ఏ స్థాయికి వెళ్తుందనేది!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bSu4bI
No comments:
Post a Comment