2007లో వచ్చిన శ్రీ మహాలక్ష్మీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూర్ణ.. ఆ తర్వాత 2012లో వచ్చిన 'అవును' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పలు సినిమాల్లో అవకాశం పట్టేస్తూ బిజీ అయిన ఆమె.. ఇటీవలే ‘’ సినిమా కంప్లీట్ చేసింది. నేడే (మర్చి 5) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో విలన్ క్యారెక్టర్లో నటించిన చిత్ర షూటింగ్‌కి సంబంధించిన పలు విషయాలపై రియాక్ట్ అయింది. యంగ్ హీరో రాజ్ తురుణ్‌తో కలిసి ‘పవర్ ప్లే’ మూవీ చేసింది పూర్ణ. థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన ఆమె.. తన కెరీర్‌లో మొదటి సారి విలన్ క్యారెక్టర్ చేసింది. అది కూడా చాలా రఫ్ క్యారెక్టర్. డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తిగా కనిపించబోతున్న ఆమె.. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా డ్రగ్స్ సేవించడం, షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు వివరించింది. తాను డ్రగ్ తీసుకునే సీన్స్ చేసేటపుడు చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. సాధారణంగా డ్రగ్స్ ఇంజక్షన్, పౌడర్ లాంటి రూపాల్లో సేవిస్తారని మనకు తెలుసు. అయితే చిత్ర షూటింగ్ చేస్తుండగా పౌడర్ తరహా డ్రగ్స్ పీల్చే సన్నివేశాల్లో ప్రాబ్లమ్ ఫేస్ చేశానని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పూర్ణ పేర్కొంది. మొదట్లో పౌడర్‌ను సరిగా పీల్చడం రాక నేరుగా పొడి మొత్తం ముక్కులోకి పోయిందని, ఆ సమయంలో సెట్ లోనే ఉన్న ఓ నటుడు ఎలా పీల్చాలో చెప్పడంతో అలవర్చుకొని తర్వాతి సన్నివేశాల్లో నటించానని పూర్ణ తెలిపింది. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై రూపొందించిన 'పవర్ ప్లే' చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38tJ2nZ
No comments:
Post a Comment