Thursday, 4 March 2021

‘షాదీ ముబారక్’ ఆడియన్స్ రివ్యూ: ఫస్టాఫ్ అంతా కారులోనే.. అయినా సూపర్!

‘మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడు పాత్ర ద్వారా పాపులర్ అయిన సాగర్ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నాలుగన్నరేళ్ల క్రితం ‘సిద్దార్థ’ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సాగర్‌కు ఏవిధంగానూ కలిసిరాలేదు. దీంతో సుధీర్ఘ విరామం తీసుకున్న సాగర్.. ఇప్పుడు ‘షాదీ ముబారక్’ అనే సినిమాతో లవర్ బాయ్‌గా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ చిత్రం ద్వారా దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి పద్మశ్రీ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (మార్చి 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసినవాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉందో చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ అంటున్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘పెళ్ళిచూపులు’ సినిమా ఎలాంటి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చిందో.. అలాంటి మ్యాజిక్ ‘షాదీ ముబారక్’లో కనిపించిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కారులోనే కథను నడిపిస్తూ.. అది కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు పద్మశ్రీ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుందని అంటున్నారు. పెళ్లి చూపులకు అబ్బాయిని తీసుకెళ్లిన అమ్మాయి.. కొన్ని గంటల్లోనే అతడి ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఆ ఇద్దరు ఎలా కలిశారు అనే కథనాన్ని దర్శకుడు రాసుకున్న తీరు బాగుందని చెబుతున్నారు. ఓ వైపు ఎంటర్‌టైన్మెంట్, మరోవైపు లవ్ స్టోరీ.. ఈ రెండింటినీ పర్ఫెక్ట్‌గా బాలెన్స్ చేశారట దర్శకుడు. ఫస్టాఫ్‌లో రాహుల్ రామకృష్ణ, భద్రం.. సెకండాఫ్‌లో హేమంత్ కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అంటున్నారు. హీరో సాగర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారట. సున్నిపెంట మాధవ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయారట. హీరోయిన్‌ దృశ్యా రఘునాథ్‌ హావభావాలు, నటన సినిమాకు ప్లస్ అయ్యాయని అంటున్నారు. తెలుగమ్మాయిలా కనిపించిన ఈ కేరళ కుట్టికి బ్రేక్‌ వచ్చినట్టే అంటున్నారు. తుపాకుల సత్యభామ పాత్ర తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఒక చిన్న సినిమా పెద్ద వినోదాన్ని పంచుతుందని పక్కాగా చెబుతున్నారు. కానీ, కొంత మంది విమర్శకులు మాత్రం ‘షాదీ ముబారక్’పై పెదవి విరుస్తున్నారు. చాలా బోరింగ్‌గా ఉందని తీసిపారేస్తున్నారు. ఇది మెట్రో, ఎ క్లాస్ సెంటర్ల వరకు మాత్రమే పరిమితమయ్యే చిత్రమంటున్నారు. మరి ఈ సినిమా హిట్టా కాదా అనేది రేపు రాబోయే కలెక్షన్ల మీద ఆధారపడి ఉంటుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rnuRZ0

No comments:

Post a Comment

'What An Engineer Earns In A Month, We Earn In 2 Hrs'

'The more popular, the more work, the more money.' from rediff Top Interviews https://ift.tt/Wx5q2dF