Sunday 21 March 2021

ఇతనేరా లీడర్.. రానాను చూసి అప్పుడే అలా అనుకున్నా.. రామానాయుడు మనవడే అయినా!: శేఖర్ కమ్ముల

విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు దగ్గుబాటి రానా. వెండితెరపై తనను తాను డిఫరెంట్‌గా చూసుకోవాలని ఆశపడే ఆయన, ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలతో అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన పాత్రలో రూపొందిన న్యూ మూవీ ''. ప్రభు సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా, తమిళంలో ‘కాండ‌న్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలను కరోనా కారణంగా వాయిదా వేసి చివరకు మార్చి 26న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిన్న (ఆదివారం) రాత్రి హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విక్ట‌రీ వెంక‌టేష్, దర్శకుడు హాజరయ్యారు. అర‌ణ్య మూవీ స్పెష‌ల్ ప్రోమోని వెంకటేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన శేఖర్ కమ్ముల.. రానాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానా ఫేస్‌ చూసి దర్శకుడు ప్రభు 'అరణ్య' సినిమాకు సెలెక్ట్ చేసుకున్నాడు కానీ తాను మాత్రం రానా వాయిస్‌ విని 'లీడర్‌' సినిమాకు హీరోగా తీసుకున్నాని అన్నారు. ఇతనేరా లీడర్.. అర్జున్ ప్రసాద్ అంటే ఇతనే అని అప్పుడే ఫిక్సయ్యానని, మొదటి సినిమాలోనే రానా విజన్ ఏంటనేది తనకు కనిపించిందని అన్నారు. రానా డిసిప్లైన్ బాగా నచ్చుతుందని, రామానాయుడు గారి మనవడా అనుకునే వాడినని తెలిపారు. షూటింగ్‌కి నిర్దేశించిన సమయానికంటే ముందే రావడం రానాలో బెస్ట్ క్వాలిటీ అని అన్నారు. అరణ్య సినిమాలో రానా యాక్టింగ్‌ సూపర్‌గా ఉందని, ఈ సినిమాలో ఇంటర్నేషనల్‌ స్టాండర్ట్స్‌ కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f48eFE

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...