‘పైన పటారం లోన లొటారం’ అంటూ అనసూయ వేసిన మాస్ స్టెప్పులకు ఆమె అభిమానులతో పాటు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కార్తికేయతో కలిసి అనసూయ దుమ్ములేపారు. లిరికల్ వీడియోనే ఇలా ఉంటే ఇక పూర్తి వీడియో సాంగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాట ‘చావు కబురు చల్లగా’ సినిమాకే హైలైట్ కానుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ పాట గురించి అనసూయ మాట్లాడారు. అనసూయ మాట్లాడిన వీడియోను జీఏ2 పిక్చర్స్ సంస్థ మంగళవారం విడుదల చేసింది. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో తాను భాగమవుతానని తాను అస్సలు అనుకోలేదని అనసూయ అన్నారు. ఈ సినిమాను తాను అంగీకరించడం వెనుక కూడా ఆసక్తికర విషయాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. అయితే, ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్పలేనని.. ప్రమోషన్స్‌లో చెబుతానని తెలిపారు. ఆఖరి నిమిషంలో ఈ సినిమాను తాను అంగీకరించానని.. ఈ పాట చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ పాట చేయడానికి అంగీకరించినప్పటికీ కాస్త ఇబ్బంది పడుతూనే సెట్‌కు వచ్చానని.. అయితే జానీ మాస్టర్, దర్శకుడు కౌశిక్, కార్తికేయ అందరూ తనకు ప్రోత్సాహం అందించారని అనసూయ చెప్పారు. షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశానని.. రాపిడ్ స్పీడ్‌లో చిత్రీకరణ జరిగిపోయిందని ఆమె తెలిపారు. రాత్రంతా సుమారు 12 గంటలపాటు ఈ పాట చిత్రీకణ జరిగిందని ఆమె వెల్లడించారు. రాత్రి 2 అయినా తాను ఎంతో యాక్టివ్‌గా షూట్‌లో పాల్గొన్నానని చెప్పారు. కొత్తగా ప్రయత్నించానని.. ఈ పాట అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నానని అనసూయ అన్నారు. కార్తికేయ డాన్స్ చేస్తుంటే చూడటానికి చాలా బాగుంటుందని చెప్పిన అనసూయ.. ఆయనతో డాన్స్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని చాలా మంది ఫీమేల్ డాన్సర్లు చెబితే విన్నానని తెలిపారు. ఇప్పటి వరకు మాస్ డాన్స్ చేయలేదని.. తన వాళ్ల కాదని జానీ మాస్టర్‌తో చెప్పినట్టు అనసూయ అన్నారు. అయితే, ఏం పర్వాలేదు తాను చూసుకుంటానని జానీ మాస్టర్ భరోసా ఇచ్చారని అనసూయ వెల్లడించారు. చెప్పినట్టుగానే తనతో మాస్ నంబర్ అద్భుతంగా చేయించారన్నారు. కాగా, ‘చావు కబురు చల్లగా’ సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందకు వస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sKcXjp
No comments:
Post a Comment