స్టార్ యాంకర్ శ్రీముఖి ఎక్కడున్నా సందడే. హుందాగా వ్యవహరిస్తూనే అల్లరి చేస్తూ ఉంటారు శ్రీముఖి. ఇక తనకు నచ్చిన వాళ్ల దగ్గర.. తన మనసుకు దగ్గరైన వాళ్ల దగ్గర శ్రీముఖి అస్సలు ఆగరు. ఎంతో చలాకీగా వాళ్లతో కలిసిపోయి సందడి చేసేస్తారు. తాజాగా ‘వైల్డ్ డాగ్’ పాత్రికేయుల సమావేశంలో ఇలానే చెంగుచెంగున లేడి పిల్లలగా గంతులేశారు శ్రీముఖి. దీనికి కారణం కింగ్ నాగార్జు. చాలా కాలం తరవాత నాగార్జునను చూసిన శ్రీముఖి ఆనందం ఆపుకోలేక ఆయన వద్దకు పరుగున వెళ్లారు. శ్రీముఖిని ఆప్యాయంగా పలకరించిన నాగార్జున ఆమెను ఆలింగనం చేసుకున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ, అవిజిత్ దత్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. అహిషోర్ సోలోమన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి, చిత్ర విశేషాలను చెప్పడానికి సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. See Photos: ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నాగార్జునను చూసిన శ్రీముఖి నవ్వుతూ ఆయన వద్దకు వెళ్లారు. ఆయన శ్రీముఖిని పలకరించి ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడం ద్వారా నాగార్జునకు శ్రీముఖి దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ చనువుతోనే నాగార్జున వద్దకు వెళ్లారు శ్రీముఖి. నాగార్జున కూడా కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీముఖి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘నిన్ను చూసి చాలా రోజులైంది శ్రీముఖి.. సంతోషంగా ఉంది’’ అని అన్నారు. దీంతో శ్రీముఖి ఆనందంతో ఉప్పొంగిపోయారు. అన్నట్టు ‘వైల్డ్ డాగ్’ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bWi613
No comments:
Post a Comment