Tuesday, 1 December 2020

హీరో నితిన్ చికెన్ ఆంథమ్.. తిన్నావా? అంటూ ప్రచారం

ప్రముఖ కార్పోరేట్ బ్రాండ్‌కు తాను ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్టు హీరో కొన్ని నెలల క్రితం ప్రకటించారు. ఈ యాడ్ షూట్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆ ఫొటోలు చూసి చాలా మంది నితిన్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నారని అనుకున్నారు. అయితే, ఈ రోజు ఆ ప్రకటనకు సంబంధించిన వీడియో విడుదలైంది. హైదరాబాద్‌కు చెందిన స్నేహ చికెన్ బ్రాండ్‌ను నితిన్ ఈ వీడియో ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. ‘‘నితిన్ లవ్‌లీ పెర్ఫార్మెన్స్, అనిల్ దర్శకత్వం ఈ యాడ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాయి’’ అని స్నేహ ఫ్రెష్ చికెన్ సీఈఓ వరుణ్ అన్నారు. ప్రభాస్ ‘సాహో’ సినిమాకు సహ రచయితగా, అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అనిల్ కుమార్ ఈ వాణిజ్య ప్రకటనను రూపొందించారు. వీడియోలో విజువల్స్, క్యాచీ సాంగ్ ప్రస్తుత తరాన్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. ‘తిన్నావా?’ అంటూ వచ్చే మాట సోషల్ మీడియాలో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. దాన్నే ఈ వీడియోలో వాడుకున్నారు. ఇదిలా ఉంటే, నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VlMYQv

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw