బుల్లితెర యాంకర్‌గా సత్తా చాటుతూనే వెండితెరపై రాణిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకుంది భరద్వాజ్. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ తనలోని నటనా ప్రతిభను బయటపెడుతున్న ఈ రంగమ్మత్త ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బులితెరపై పలు షోస్ హోస్ట్ చేస్తూనే సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనసూయ ప్రధాన పాత్రలో వస్తున్న కొత్త సినిమా ''. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రమేశ్ రాపర్తి దర్శకత్వంలో 'థాంక్యూ బ్రదర్' రూపొందుతోంది. శరత్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ గర్భిణిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పోస్టర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో లిఫ్టులో అనసూయ, అశ్విన్ ఇద్దరూ ఇరుక్కుపోయి ప్రాణభయంతో ఉన్నట్లు చూపించారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ఈ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మహేష్ బాబు.. 'థాంక్యూ బ్రదర్' సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, మోషన్ పోస్టర్ చాలా థ్రిల్లింగ్‌గా ఉందని అన్నారు. దీనిపై సప్నదించిన అనసూయ ‘థాంక్యూ మహేష్ బాబు సర్’ అని పేర్కొంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34IHDYN
No comments:
Post a Comment