Saturday, 7 November 2020

US Election Result: అమెరికా ఎన్నికల ఫలితాలపై మంచు లక్ష్మి సెటైరికల్ పోస్ట్..!

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రెటీల్లో ఒకరు. ఓ వైపు వెండితెర, మరోవైపు బుల్లితెరలపై రాణిస్తూనే సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ మంచువారమ్మాయి. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులతో పాటు పలు సామాజిక అంశాలపై స్పందించే ఆమె.. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం కొనసాగుతోంది. కాకపోతే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపు దాదాపు ఖాయమయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అధిక స్థానాల్లో విజయం సాధించి విజయానికి చేరువయ్యారని తెలుస్తుండటం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ట్రంప్ ఇక శ్వేతసౌధాన్ని వదిలేయడం పక్కా అని హింట్స్ వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నరకాల స్పందనలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠం గురించి దేశవిదేశాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. Also Read: ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ నటి, మంచు మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మి ఓ సెటైరికల్ ట్వీట్ వదిలింది. ఓ భవంతి వెనుక నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ముందుకు చూస్తూ ‘ఆయన ఇంకా వెళ్లిపోలేదా’ అని అడుగుతున్నట్లు ఉన్న ఓ ఫోటో షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ ఫొటోకు #USElectionResults2020 అనే హ్యాష్ ట్యాగ్‌ జత చేయడంతో ఆమె చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38kpZwX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....