Monday 9 November 2020

Nithin: థియేట‌ర్‌లో చూసిన కుర్రాడితో సినిమా... ఇండ‌స్ట్రీ హిట్.. కలెక్షన్లు అరాచకం

అది 2001 సంవత్సరం. ఉదయ్ కిర‌ణ్ నటించిన ‘నువ్వు నేను’ రిలీజ్ అయిన రోజు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో దర్శకుడు తేజ ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నాడు. ఇంటర్వెల్ టైమ్‌లో ఆయన కన్ను ఓ టీనేజీ కుర్రాడిపై పడింది. అతడి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని.. నీకు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ ఉందా? అని అడిగాడు. చాలా ఇంట్రస్ట్ అని ఆ కుర్రాడు చెప్పడంతో కాంటాక్ట్ నంబర్ తీసుకుని.. అవసరమైనప్పుడు పిలుస్తా అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ కుర్రాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు అని ఆ తర్వాత తేజకు తెలిసింది. పైగా ‘నువ్వు నేను’ సినిమాకి సుధాకర్‌ రెడ్డే నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. Also Read: ‘నువ్వు నేను’ బ్లాక్‌ బస్టర్ హిట్ కావడంతో తేజకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు అర్జున్‌ని లాంచ్ చేయాలని ఆఫర్ ఇచ్చారు. దీంతో తేజ ఓ స్క్రిప్ట్ రెడీ చేసి అల్లు అర్జున్‌పై టెస్ట్ షూట్ సెట్ అవలేదు. దీంతో నెక్ట్స్ మూవీ చేద్దామని అల్లు అరవింద్‌కు సారీ చెప్పేవాడు. ఎంతమందికి స్క్రీన్ టెస్ట్ చేసినా సెట్ కాకపోవడంతో చివరికి నితిన్‌కి కాల్ చేశాడు. ఫోటో షూట్‌లో తాను అనుకున్నట్లుగా ఉండటంతో నితిన్‌ను ఓకే చేసేశాడు. ముంబయి కో ఆర్డినేటర్‌ ద్వారా సదాని హీరోయిన్‌గా ఫైనల్‌ చేశాడు. Also Read: హీరోగా ముంబయికి చెందిన ఓ నటుడిని తీసుకుని కొన్ని సీన్లు షూట్ చేశాక తేజకు నచ్చలేదు. దీంతో వెంటనే గోపీచంద్‌కు ఫోన్ చేయగా అతడు హీరో వేషమనుకుని రెక్కలు కట్టుకుని వచ్చేశాడు. తీరా అక్కడికి వెళ్లాక విలన్ పాత్ర అని తెలుసుకుని షాకయ్యాడు. అయితే తేజ మీద నమ్మకంగా కాసేపు ఆలోచించుకుని ఓకే చెప్పేశాడు గోపీచంద్. అయితే అమ్మతో పాటు చాలామంది స్నేహితులు, సన్నిహితులు విలన్ క్యారెక్టర్ చేయొద్దని చెప్పినా తనకు తేజపై నమ్మకముందని చెప్పాడంట. ఓ సన్నివేశంలో హీరోయిన్ ఏడ్వాలి. అయితే సదా గ్లిజరిన్ పెట్టుకున్నప్పటికీ కన్నీళ్లు రాకపోవడంతో తేజ ఆమెను చెంపపై కొట్టాడంట. దీంతో ఆమె ఏడుపు మొహం పెట్టుకోగా దాన్నే సీన్‌గా తీసేశాడట. ఇలా కేవలం 65 రోజుల్లోనే రూ.1.80కోట్ల బడ్జెట్‌తో ‘’ సినిమా తెరకెక్కింది. కథ పాతదే అన్న విమర్శ వచ్చినప్పటికీ తేజ టేకింగ్, నితిన్, సదా, గోపీచంద్ నటగ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో హీరోని చూసి సదా చెప్పిన ‘వెళ్లవయ్యా వెళ్లు.. వెళ్లూ..’ అంటూ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఈ సినిమాతో సుమారు 30 మంది కొత్త ఆర్టిస్టులు వెండితెరపై పరిచయమయ్యారు. వీరిలో ఒకరైన సుమన్ శెట్టి తొలి సినిమాతోనే ఆకట్టుకుని ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు. Also Read: 58 ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు వారాల్లో 150 ప్రింట్లకు చేరింది. 70 సెంటర్లలో 100 రోజులు ఆడింది. రూ.1.80కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే లాంగ్ రన్‌లో సుమారు రూ.32 కోట్ల వ‌ర‌కు కలెక్షన్లు సాధించింది. బెస్ట్ డెబ్యూ హీరోగా నితిన్, హీరోయిన్‌గా సదా ఫిల్మ్ ఫేర్ అవార్టులు అందుకోగా.. గోపీచంద్‌ బెస్ట్ విలన్‌గా నంది అవార్డు దక్కించుకున్నాడు. విలన్‌ పాత్ర చేయొద్దని చెప్పినవాళ్లే.. ఆ పాత్రను నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరంటూ గోపీచంద్‌ను ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JLqJko

No comments:

Post a Comment

'It's Not Sexualised Nudity'

'I made it very clear even at the casting process that there was going to be a lot of nudity.' from rediff Top Interviews https://...