Saturday 14 November 2020

Chiranjeevi: గురువుని కలసిన మెగాస్టార్.. విశ్వనాథ్‌కి చిరు పాదాభివందనం

తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు కె. విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు. కాగా తనను హీరోగా నిలబెట్టిన గురువు విశ్వనాథ్‌ని దీపావళి సందర్భంగా సతీసమేతంగా మెగాస్టార్ కలిశారు. కాసేపు ఆయనతో ఆప్యాయంగా మాట్లాడి పాదాభివందనం చేశారు. ఇండస్ట్రీలో పెద్ద స్థాయిలో ఉన్న తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల కాశీ విశ్వనాథ్ మనస్సులో ఆనంద క్షణాలు చిగురించాయి. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. ఇది ఇటు చిరు అభిమానుల్లోనూ, విశ్వనాథ్ అభిమానుల్లోనూ సంతోషాన్ని నింపింది. విశ్వనాథ్ సినిమాలకు ప్రపంచ సినిమాస్థాయి ఉన్న విషయం మనకు తెలిసిందే. Also Read: విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ''శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి'' లాంటి సినిమాలు ఆయన కెరియర్‌లో మైలురాయిగా నిలిచాయి. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించి ఈ రోజు ఆయ‌న ఇంటికి రావ‌డం జ‌రిగింది. ఆయ‌న నాకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన చిత్రాలు తీశారు. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌ల‌వ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అంద‌రికీ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kuYSBP

No comments:

Post a Comment

'AI Doesn't Care Where It Goes To School'

'No one manufactures intelligence at the moment.' from rediff Top Interviews https://ift.tt/FtDHBiR