Sunday 15 November 2020

ఒక్కరోజుకే అన్ని లైకులా... విజయ్ ‘మాస్టర్’ టీజర్ అరాచకం

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాస్టర్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సోషల్‌ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 24 గంటలు గడవకముందే ఏకంగా 16 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు 1.7 మిలియన్ లైక్స్ సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 22 మిలియన్ వ్యూస్ దాటగా.. 1.9మిలియన్ లైకులతో ఎవరినీ అందని ఎత్తులో నిలిచింది ఈ టీజర్ Also Read: కార్తితో ‘ఖైదీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘మాస్టర్’పై భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య నటించిన సినిమాలన్నీ వరుసగా వందల కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో నేరుగా విడుదలవుతున్న ‘మాస్టర్’తో విజయ్ రికార్డు కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38GhBrQ

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...