Friday, 6 November 2020

వైరల్ అవుతున్న నిధి అగర్వాల్ బాత్రూమ్ సెల్ఫీ.. ఇస్మార్ట్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదు బాబోయ్!

ఇస్మార్ట్ బ్యూటీ సోయగాల గురించి ప్రత్యేక వర్ణన అవసరం లేదు. వెండితెరపై అమ్మడి ఒంపుసొంపులు చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. నటనా ప్రతిభకు తోడు ఆకర్షించే అందం ఆమె సొంతం కావడంతో నిధికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు మోడ్రన్ దుస్తులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్ పోస్ట్ చేయడం నిధి హ్యాబీ. ఈ క్రమంలోనే తాజాగా బాత్రూమ్ సెల్ఫీ పోస్ట్ చేసి షాకిచ్చింది ఇస్మార్ట్ బ్యూటీ. లాక్‌డౌన్ వేళ సినిమా షూటింగ్స్ లేకపోవడంతో నిధి చేసిన సోషల్ మీడియా రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. వరుసపెట్టి తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ మైమరిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా బాత్రూమ్ సెల్ఫీ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ సెల్ఫీలో సెగలు పుట్టించే అందంతో అట్రాక్ట్ చేస్తోంది నిధి. అలా లో- దుస్తుల్లో నిధిని చూసి ఆమె అందాలను వర్ణిస్తూ నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. 'మున్నా మైఖేల్' సినిమాతో హీరోయిన్‌గా కెమెరా ముందుకొచ్చిన నిధి అగర్వాల్.. 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌ చిత్రసీమకు పరిచయమైంది. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. అదేవిధంగా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా 'అల్లుడు అదుర్స్'లో ఐటెం సాంగ్‌తో అదరగొట్టనుందని సమాచారం. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eBOiaB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....