లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యూ.. లాంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన .. గుర్తున్నాడా?. కొన్నాళ్లుగా వెండితెరకు దూరమైన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?. ఇంతకాలం సినిమాలకు దూరమైనా ఆయన ప్రజలకు చేరువగానే ఉన్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ మారిన ఆదిత్య ఏకంగా ఐదు గ్రామాలను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూసుకుంటున్నారు. Also Read: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి పరిసరాల్లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకున్న ఆదిత్య ఐదేళ్లుగా వాటిని డెవలప్ చేస్తున్నారు. తాజాగా తన మిత్రుడు, నిర్మాత పీవీఎస్ వర్మతో కలిసి 500 మంది రైతులకు మామిడి, కొబ్బరి విత్తనాలను సరఫరా చేశారు. దీంతో పాటు గ్రామీణ యువతీయువకులకు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. చేరువల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. చాలాకాలంగా మేకప్ వేసుకోకుండా ఉన్న ఆదిత్య ఓం ప్రేక్షకులను అలరించేందుకు మళ్లీ తెరపైకి రానున్నారు. ‘’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రంలో ఆయన నటిస్తున్నారు. కేవలం ఒకే పాత్రతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రాఘవ.టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IECcSS
No comments:
Post a Comment