Saturday, 7 November 2020

బూతు డైలాగులు, హద్దు దాటిన అడల్ట్ సీన్స్.. చితక్కొట్టుడంటే ఇదేనేమో! రచ్చ రచ్చ చేశారులే..

రూటు ఏదైతేనేం.. తమ సినిమాను ఎలాగైనా జనం నోళ్ళలో నానేలా చేసి హైప్ తీసుకురావడమే టార్గెట్‌గా పెట్టుకొని కొన్ని చిన్న సినిమాలను హద్దు దాటిన శృంగారంతో నింపేస్తున్నారు మేకర్స్. ఆయా సినిమాలను ప్రమోట్ చేయడంలో భాగంగా శృతిమించిన శృంగార సన్నివేశాలను ఎరగా వేసి బాబోయ్! అనిపిస్తున్నారు. అలా అడల్ట్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ '' కూడా అదే కోవలోకి చెందిందని తెలుస్తోంది. గతేడాది వచ్చిన 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాకు సీక్వెల్‌‌గా 'చితక్కొట్టుడు 2'ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సంతోష్ పి జయకుమార్ ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు పనులన్నీ పూర్తిచేసిన చిత్రయూనిట్ ఇక విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బయట పెడుతున్న వీడియోలు ఆన్‌లైన్ వేదికలను షేక్ చేస్తున్నాయి. టైటిల్‌కి యాప్ట్ అయ్యేలా అడల్ట్ డోస్ పెంచి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. Also Read: తాజాగా 'చితక్కొట్టుడు 2' టీజర్ రిలీజ్ చేశారు. ప్రారంభంలోనే హెడ్ సెట్ పెట్టుకుని టీజర్ చూడమని హెచ్చరిస్తూ ఆ మాటకు న్యాయం చేసేలా బూతు డైలాగులు వినిపించారు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రచ్చ రచ్చ చేశారు. 'మందైనా సరే.. హ్యాండ్ అయినా సరే ఓవర్‌గా కొడితేనే తప్పు' అంటూ హీరోయిన్ చెప్పిన బోల్డ్ డైలాగ్, ఆ రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ రకంగా తమ సినిమా టీజర్‌తో సోషల్ మీడియాను షేక్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. అడల్ట్ సన్నివేశాలకు తోడు హార్రర్, థ్రిల్లింగ్ జోడించి ఈ మూవీ రూపొందించారని టీజర్ ద్వారా తీసిపోయింది. ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఎస్. హ‌రి భాస్కర్ నిర్మిస్తున్న ఈ మూవీ అతిత్వరలో రిలీజ్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3p4QRab

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....