Monday, 23 November 2020

హీరో నుంచి కమెడియన్‌గా మారిన సుధాకర్.. రూ.కోట్లలో ఆస్తులు.. కోమాలోకి వెళ్లడానికి కారణమిదే..

తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన చాలామంది సినీనటులు చివరి దశలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. అలాగే కొంతమంది దొరికిన అవకాశాలను చేజిక్కించుకుని భారీగా ఆస్తులు వెనకేసున్నవారూ ఉన్నారు. ఈ కోవలోనే ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా బిజీగా గడిపిన సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1959, మే 18వ తేదీన జన్మించిన సుధాకర్ సినిమాలపై ఇష్టంతో మద్రాస్‌ వెళ్లారు. అక్కడ చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులతో కలిసి ఒకే గదిలో ఉండేవారు. అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా ఆయనకు పరిచయమయ్యారు. ఆయన అవకాశం ఇవ్వడంతో ‘కిళుక్కెమ్ పొంగెమ్ రెయిల్’ అనే సినిమా హీరోగా నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సుధాకర్‌కు అవకాశాలు పెరిగాయి. అలా తమిళంలో సుమారు 45 సినిమాల్లో నటించారు. అప్పటి స్టార్ హీరోయిన్‌తో రాధికతోనే ఆయన ఏకంగా 18 సినిమాల్లో నటించడం విశేషం. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల కారణంగా కోలీవుడ్‌ను వీడిన ఆయన తెలుగులో విలన్‌గా, కమెడియన్‌గా స్థిరపడిపోయారు. Also Read: యముడికి మొగుడు, పెద్దరికం, శుభాకాంక్షలు, స్నేహితులు, సుస్వాగతం, హిట్లర్, యమజాతకుడు వంటి సినిమాలు ఆయన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. హాస్యనటుడిగా ప్రభుత్వం నుంచి నంది అవార్డు కూడా అందుకున్నారు. సినిమాల ద్వారా భారీగా సంపాదించిన సుధాకర్, తన మిత్రుడు హరిప్రసాద్‌తో కలిసి చిరంజీవి హీరోగా ‘యముడికి మొగుడు’ సినిమా నిర్మించారు. దీంతో మరికొన్ని సినిమాలు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. 2010, జూన్ 29న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సుధాకర్ కోమాలోకి వెళ్లిపోయారు. 2015లో కోలుకున్న ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. కొన్ని సినిమాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. Also Read: తన స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవి కంటే ముందే వెండితెరపై హీరోగా మారిన సుధాకర్.. ఆ తర్వాత ఆయన పక్కనే కమెడియన్‌గా నటించారు. వందలాది సినిమాల్లో నటించిన సుధాకర్ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సుధాకర్ కోమాలో ఉన్నప్పుడు చిరంజీవి సహా ఆయన స్నేహితులు కుటుంబానికి అండగా నిలబడ్డారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/339EosA

No comments:

Post a Comment

'This Roller Coaster Has Taught Me To...'

'...just be neutral about everything.' from rediff Top Interviews https://ift.tt/p3n6AQF