Saturday 7 November 2020

‘అరుంధతి’ని రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్.. అనుష్కకు దక్కిన లక్కీఛాన్స్

తెలుగు సినిమాల్లో హీరోయిన్ అంటే రెండు మూడు పాటల్లో అందాలు ఆరబోయడం, హీరో పక్కన నాలుగు సీన్లలో కనిపించడం కాదని నిరూపించిన నటి . ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క తొలినాళ్లలో అందాల ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చింది. అయితే అనూహ్యంగా ‘అరుంధతి’ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడంతో ఆమె లైఫే పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో అగ్ర హీరోయిన్‌ హోదా దక్కించుకుంది. ఈ కోవలోనే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి-2, భాగమతి.. సినిమాలు ఆమెను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ‘అరుంధతి’ సినిమాలో అనుష్కకు ఛాన్స్ ఎలా దక్కిందో తెలుసా..?. అనుష్క నేటితో(నవంబర్ 7) 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ విశేషాలు మీకోసం.. Also Read: ‘అరుంధతి’ అంటే అనుష్క, అనుష్క అంటే ‘అరుంధతి’ గుర్తుకొస్తుంది కదా. అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది ఆ సినిమా. అనుష్క కోసమే ఆ పాత్ర పుట్టుకొచ్చిందా? అనే సందేహం కలగకమానదు. శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు స్ఫూర్తినివ్వడంతో పాటుప్రేక్షకులకు సరికొత్త గ్రాఫిక్స్‌ విజువల్స్‌ను పరిచయం చేసింది. 2009లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకుంది. Also Read: ఈ సినిమా అంతలా విజయం సాధించడానికి కోడి రామకృష్ణ టేకింగ్, గ్రాఫిక్స్‌తో పాటు అనుష్క అభినయం కూడా ఎంతో దోహదం చేసింది. అప్పటివరకు అందాల ప్రదర్శనకే పరిమితమైన అనుష్కలో ఇంతటి నటి దాగుందా? అని ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు. కథకు తగ్గట్లు రాజసం ఉట్టిపడే పాత్ర పోషించి తాను తప్ప ఆ పాత్రను మరెవరూ చేయలేరు అనిపించుకుంది. ఇంతటి అవకాశం అనుష్కకు రావడానికి కారణం పరోక్షంగా మరో హీరోయిన్ కారణమైందని మీకు తెలుసా...? ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ‘యమదొంగ’ ఫేం మమతా మోహన్‌దాస్‌. అవును చిత్ర బృందం అరుంధతి కథను సిద్ధం చేసుకుని తారాగణం కోసం అన్వేషించి మమతను ఎంపిక చేసిందట. అప్పటికే ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నప్పటికీ అరుంధతి పాత్రను పోషించేందుకు సుముఖత వ్యక్తం చేసిందట. అయితే అలాంటి సినిమాలు పూర్తికావడానికి చాలా టైమ్ పడుతుందని, ఈ గ్యాప్‌లో రెండు, మూడు సినిమాలు చేసుకోవచ్చని ఎవరో ఆమెకు చెప్పారంట. దీంతో మనసు మార్చుకున్న మమతా మోహన్‌దాస్ ‘అరుంధతి’ని తిరస్కరించిందట. దీంతో మళ్లీ ఆరగడుగుల కథానాయిక కోసం వెతికే పనిలో అనుష్కను సంప్రదించిందట చిత్ర యూనిట్. కథ వినగానే అనుష్క ఓకే చెప్పేయడం, షూటింగ్ చకచకా జరిగిపోవడం కలగా అయిపోయిందట. అయితే రిలీజ్ సమయంలో ఫైనాన్షియర్లు ఇబ్బంది పెట్టినా అన్ని అడ్డంకులు అధిగమించిన ‘అరుంధతి’ ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయం సాధించింది. అలా మమత తిరస్కరించిన ‘అరుంధతి’ అనుష్కగా మారింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/358iGGO

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...